నందమూరి నటసింహ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా…
నందమూరి నటసింహ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అభిమానులు ఊగిపోతారు. వారిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రీక్ మూవీ కోసం ఎప్పటి నుంచో అభిమానులు వేచి చూస్తున్నారు. అభిమానులు కోరుకున్నట్లే ఈ కాంబినేషన్ సెట్ అయింది. సెట్‌పైకి సినిమా ఎక్కేసింది. కానీ మధ్యలో కరోనా అంటూ కొన్ని రోజులు బ్రేక్. ఈ లోపు అభిమాన హీరో పుట్టినరోజు వచ్చేసింది. బర్త్‌డేకి టీజర్ వదులుతారా? లేదా? అని అభిమానుల్లో ఒకటే టెన్షన్. అలాంటి అభిమానుల కోసం ఒకటి కాదు బాలయ్య డబుల్ ట్రీట్ ఇచ్చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటల 03 నిమిషాలు ‘శివశంకరీ’ అంటూ స్వయంగా తను పాడిన పాటను వదిలిన బాలయ్య, తాజాగా తను బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ను వదిలారు. ఈ టీజర్ ఎలా ఉంది? అని అడగాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆ కాంబినేషన్ అలాంటిది. గర్జిస్తోంది అంతే.
టీజర్‌లో.. తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టుతో బాలయ్య ఎంట్రీ అదిరిపోయింది. ఒక ఫైట్‌కి సంబంధించిన ఎపిసోడ్.. ఆ తర్వాత డైలాగ్.. ఇలా టీజర్ కట్ చేశారు. ‘‘ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.. శీనుగారు మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి, శీనుగారు ‘మీ అమ్మ మొగుడు’ బాగున్నారా? అనేదానికి చాలా తేడా ఉందిరా.. లం****కా’’ అనే డైలాగ్ బాలయ్య వాయిస్‌లో నిజంగా గర్జించినట్లే ఉంది. దీనికి థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాములుగా లేదు. మొత్తం ఈ బర్త్‌డేకి అభిమానులు ఎప్పటికీ మరిచిపోని విధంగా బాలయ్య ట్రీట్ ఇచ్చాడనేది అందరూ అంగీకరించాల్సిందే.