కరోనా పేషెంట్లు ఉన్న టిమ్స్ ఆస్పత్రిలో ఈటల రాజేందర్ గారు…


వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్లు, సిబ్బంది లో స్ఫూర్తి నింపుతున్నారు ఈటెల రాజేందర్ . కరోనా పేషెంట్లు ఉన్న చుట్టుపక్కల కే వెళ్లడానికి జనం జంకుతున్నఈ రోజుల్లో ఏకంగా పాజిటివ్ పేషెంట్లు ఉన్న హాస్పిటల్ కి వెళ్ళి వారి బాగోగులు తెలుసుకున్నారు.గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలోఉన్న ప్రతి పేషెంట్ పలకరించి మేమున్నాము అని భరోసా కల్పించారు
పాజిటివ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, పని చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తో ముఖాముఖిగా మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు.శక్తివంచన లేకుండా రోగులకు సేవ చేయాలని వారిలో ప్రోత్సాహాన్ని నింపారు.
కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా లేనన్ని సదుపాయాలు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాయని విశాలమైన గదుల్లో పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని అని మంత్రి తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రులు ఇంజెక్షన్ల లేవని చేతులు ఎత్తేస్తున్నారు, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయి అవసరమున్న ప్రతి రోగికి అత్యాధునిక, ఖరీదైన మందుల ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. రెమెడిస్వీర్ లాంటి ఇంజక్షన్లను అవసరం ఉన్న ప్రతి పాజిటివ్ పేషెంట్ కు ఇచ్చి వారిని బ్రతికించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్ సంతృప్తిని వ్యక్తం చేశారని ఇది ఎన్నో రోజులుగా కరోనా యుద్ధం చేస్తున్న తమకు సంతోషాన్ని కలిగించే అంశమని మంత్రి అన్నారు.
కరోనా వైరస్ వచ్చిన మొదటి రోజుల్లో వైరస్ ప్రభావం గురించి సోషల్ మీడియాలో, టీవీ చానళ్లలో జరుగుతున్న ప్రచారం చూసి ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యారు. గాంధీ ఆసుపత్రి లో పనిచేస్తున్న జూనియర్ డాక్టర్లు సైతం గాంధీని కోవిడ్ సెంటర్ గా మార్చవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్న సమయంలో.. గాంధీ హాస్పిటల్ చుట్టూ ఉన్న ప్రజలు చాలా మంది గాంధీ లో కరోనా పేషెంట్లు వద్దు అంటూ ఆందోళనకు దిగిన సమయంలో .. గాంధీ హాస్పిటల్ కి వెళ్లి కరోనాతో చికిత్స పొందుతున్న మొదటి పేషెంట్ తో నేరుగా మాట్లాడి అతనికి భరోసా కల్పించడమే కాకుండా.. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది అందరికీ ప్రోత్సాహంగా నిలిచారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఈ రోజుకి కూడా కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లాలంటే సొంత కుటుంబ సభ్యులే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పేషంట్ల బాగోగులు తెలుసుకునేందుకు దేశంలోనే మొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా కోవిడ్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్సపొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి భరోసా కల్పిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. రికార్డు సమయంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఈరోజు సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఎక్కువ వైరస్ తో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారిని ఐసీయూలో ఉంచుతారు.. అలాంటి ఐసీయూలోకి కూడా మంత్రి వెళ్లి అక్కడ ఉన్న పేషంట్లతో నేరుగా మాట్లాడారు. వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్స్రేలు, రక్తపరీక్షలు, ఇతర టెస్ట్ గురించి తెలుసుకొని పలు కీలక సూచనలు చేశారు. డాక్టర్లు సిబ్బంది రోజులో ఎన్ని సార్లు వస్తున్నారు? వారు అందిస్తున్న చికిత్సా విధానం ఎలా ఉంది?
భోజనం ఎలా ఉంది? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అంటూ ప్రతి రోగిని అడిగి తెలుసుకున్న మంత్రి వారి సమాధానాలతో పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయి వెంటిలేషన్ తో విశాలమైన గదులు, పరిశుభ్రం అయిన బాత్ రూమ్స్ ఉండటంతో ఇక్కడున్న సదుపాయాలపైపేషెంట్లు సంతృప్తి వ్యక్తం చేశారు.
గచ్చిబౌలిలో పని చేస్తున్న డాక్టర్లు అందరు కూడా యుక్త వయసు వారు కావడంతో మరింత ధైర్యంగా పనిచేయాలని మంత్రి కోరారు. టీమ్స్ లోనే పై ఫ్లోర్ లలో ఉన్న గదులలో ఉండి 24 గంటలు అందుబాటులో ఉంటున్నామని డాక్టర్లు చెప్పడంతో వారందరిని మంత్రి అభినందించారు.
రోగులకు అందిస్తున్న ఆక్సిజన్ సదుపాయం గురించి క్షుణ్ణంగా పరిశీలించి, సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించిన మంత్రి ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ కు సూచించారు. ఒక ఆర్ ఏం ఓ ని ప్రత్యేకంగా సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏ ఒక్క పేషంట్ ని కూడా వెనక్కి తిప్పి పంపవద్దని.. టిమ్స్ లో 1035 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి చికిత్సఅందించే ప్రయత్నం చేయాలని సూచించారు.
కావలసినంత మంది డాక్టర్లను ఏర్పాటు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డిని మంత్రి ఆదేశించారు.
పేషెంట్లకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించిన మంత్రి.. గతంలో కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నము కాబట్టి నాణ్యత లోపం లేకుండా చూడాలని కోరారు. కరోనా వైరస్ సోకి మరణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో భయాందోళనలకు గురి కావద్దని మంత్రి పిలుపునిచ్చారు. కరోనాకి అందిస్తున్న వైద్యానికి పది వేల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదని.. లక్షల రూపాయలు ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేయడం, అడ్వాన్స్ చెల్లించనిదే చేర్చుకోకపోవడం ..
రోజుకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు కాబట్టి ప్రజలు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు వినియోగించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారు.

About The Author